Lavanya Tripathi : నిహారిక వల్ల లావణ్య త్రిపాఠి ప్రతీ రోజు ఇంట్లో ఇంత టార్చర్ చూస్తుందా..? అందుకే జిమ్ కి వెళ్లడం కూడా మానేసిందా!

- Advertisement -

Lavanya Tripathi : ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్లామర్ రోల్స్ కి దూరంగా కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది ఆమె ఇన్ని రోజులు. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడిన ఈమె, ఇప్పుడు లేటెస్ట్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది.

Lavanya Tripathi
Lavanya Tripathi

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తన ప్రియుడి కోసం పని మనిషిగా ఎలా మారింది అనే దానిపై సినిమా ఉంటుంది అని లావణ్య త్రిపాఠి రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశం లో చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రం లో హీరోగా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్న వెబ్ సిరీస్ ఇది.

బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా కేవలం వరల్డ్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న అభిజిత్ మొత్తమొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సిరీస్ ఇది. ఇకపోతే నిన్న జరిగిన మీడియా సమావేశం లో లావణ్య త్రిపాఠి ని పలువురు రిపోర్టర్స్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. వరుణ్ తేజ్ తో మీ పెళ్లి జీవితం ఎలా ఉంది అని ఒక రిపోర్టర్ అడగగా దానికి లావణ్య సమాధానం చెప్తూ ‘అద్భుతంగా ఉంది.. మా ప్రైవేట్ జీవితాన్ని ప్రతీ క్షణం ఆస్వాదిస్తూ సంతోషం గా గడుపుతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ తర్వాత మీ బెస్ట్ ఫ్రెండ్ నిహారిక కొణిదెల తో మీ బాండింగ్ ఇంకా బలపడింది కదా అని అడగగా, దానికి లావణ్య సమాధానం చెప్తూ ‘అవును.. వరుణ్ తేజ్ కంటే నేను ఎక్కువగా ఈమెతోనే ఉంటున్నాను.. ప్రతీ విషయం లోని ఈమె నాకు పోటీని ఇస్తుంది. ముఖ్యంగా జిమ్ లో అయితే ఈమె చేయించే వర్కౌట్స్ చెయ్యలేక టార్చర్ చూస్తుంటాను. ఈమె దెబ్బకి జిమ్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుంది’ అంటూ లావణ్య త్రిపాఠి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here