ప్రస్తుతం ఎక్కడ చూసినా టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఓ బాబు పుట్టిన తర్వాత ఎవరికి చెప్పకుండా.. ఇలా గుట్ట చప్పుడు కాకుండా విడాకులు తీసుకోవడం అభిమానులను కలచి వేస్తుంది . వీళ్ల పెళ్లి టైం లో ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పటికీ ఆ విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు .. అలాగే అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల్లో ఒక కామన్ పాయింట్ ఉందంటూ అభిమానులు ట్రెండ్ చేసేస్తున్నారు. సమంతా నాగచైతన్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు . ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే ఇక్కడ విడాకులకు ప్రధాన కారణంగా నిలిచింది.
అంతేకాదు సమంతనే నాగ చైతన్యకు విడాకులు కావాలంటూ ముందు అడిగేసిందట. ఇప్పుడు కూడా సానియా మీర్జా విషయంలో అదే జరిగింది. సానియా మీర్జానే ముందుగా షోయబ్ ని విడాకులు కావాలి అంటూ అడిగిందట. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న రీసెంట్ గా చెప్పుకొచ్చాడు. దీంతో షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకుల మేటర్ మరోసారి వైరల్ అవుతోంది.