Supritha: సుప్రీత సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఆమె ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు కానీ చాలా పాపులారిటీ సంపాదించుకుంది. తాను చేసిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

సురేఖ వాణి కూతురిగా కాకుండా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో సుప్రీత తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె తన తల్లితో కలిసి షికార్లు చేయడం, పబ్బులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజులుగా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చాలా కథనాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎందుకో తెలీదు కానీ అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తూ.. హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుంది.

తాజాగా ఈ అమ్మడు కారులో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చేతిలో మొబైల్ పట్టుకుని ముద్దులతో రెచ్చిపోయింది. ఇతరులను ఆకట్టుకోవడానికి ముద్దులు పెడుతూ ఒక సెల్ఫీలు తీసుకుంది. ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.. త్వరలో సినిమాల్లోకి అడుగుపెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో ఎంట్రీ ఇస్తుంది ? ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.