Renu Desai : పర్సనల్ సెక్యూరిటీని నియమించుకున్నరేణు దేశాయ్.. తాటతీస్తా అంటూ వార్నింగ్

- Advertisement -

Renu Desai : మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో అకిరా, ఆద్యలు కూడా భాగమయ్యారు. వారిద్దరిని మెగా ఫ్యామిలీతో కలిపి చూసి ఇటూ ఫ్యాన్స్‌, అటూ పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ ఫొటో షేర్‌ చేసిన చిరంజీవి మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి థ్యాంక్స్‌ చెబుతున్నారు. అప్పటి నుంచి అకిరా లుక్‌, కటౌట్‌పైనే అందరి దృష్టి పడింది. వింటేజ్‌ పవన్‌ దొరికాడంటూ అంతా చర్చించుకుంటున్నారు.

Renu Desai
Renu Desai

ఓవైపు కూతురు కొడుకు మెగా ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తుంటే మరోవైపు పవన్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ కేరళలోని అందాలను ఆస్వాధించారు. సంక్రాంతికి కేరళకు వెళ్లిన ఆమె తరచూ ఫొటోలు షేర్‌ చేస్తూ మురిసిపోయారు. అలా ఈ మధ్య ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటున్న రేణు దేశాయ్‌ తాజాగా తన కూతురు ఆద్యకు సంబంధించిన ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ట్రోలర్లకు ఆమె గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఆద్య పంచ్‌లు విసురుతున్న వీడియోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కు క్యూట్‌ క్యాప్షన్‌ జత చేశారు ఆమె.

Renu Desai Adhya

“ఇకపై నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే.. నా పర్సనల్‌ సెక్యూరిటీ మీ తాట తీస్తుంది. జాగ్రత్త” ట్రోలర్స్‌కు ఇన్‌డైరెక్టర్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. కాగా ఆద్య కరాటే నేర్చుకున్నట్టు గతంలో రేణు దేశాయ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. భర్తతో (పవన్‌ కళ్యాణ్‌) విడిపోయిన అనంతరం రేణు దేశాయ్‌ తన కూతురు, కొడుకుతో సింగిల్‌ జీవిస్తోంది. మెగా ఫ్యామిలీకి దూరంగా మహారాష్ట్రలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు పవన్‌ను ఉద్దేశిస్తూ తరచూ పోస్ట్స్‌ షేర్‌ చేస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here