Mahesh Babu కి ఆ హీరోయిన్ అంటే అంత అసహ్యం ఎందుకు..? ఏకంగా డైరెక్టర్ తోనే గొడవలు!

- Advertisement -

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే ‘గుంటూరు కారం’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బుకింగ్స్ తో సంబంధం లేకుండా నోటికి వచ్చిన లెక్కలు వేసుకుంటూ పోతున్నారంటూ గుంటూరు కారం నిర్మాతలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు. మీరు ఎన్ని ట్రోల్ల్స్ వేసుకున్నా మేము చేసేది చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ఈ సినిమా నిర్మాత వ్యవహరిస్తున్నాడు.

Mahesh Babu
Mahesh Babu

ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చకచకా చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది మధ్యలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా తీసుకునేందుకు డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే పలువురిని సంప్రదించాడట.

Mahesh Babu Rajamouli

వారిలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈమె ఒక సినిమా చేసే ముందు అగ్రిమెంట్ లో తాను ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరు అవ్వను అనే కండిషన్ మీదనే సంతకం చేస్తుంది. కానీ రాజమౌళి సినిమా అంటే ప్రొమోషన్స్ లేకుండా ఎలా ఉంటుంది. #RRR మూవీ ప్రొమోషన్స్ కి రాజమౌళి ఏకంగా మూడు నెలల సమయం తీసుకున్నాడు.

- Advertisement -
Mahesh Babu Nayanthara

మరి ప్రొమోషన్స్ కి రానటువంటి నయనతార ని ఎలా ఒప్పిస్తాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే విషయాన్నీ మహేష్ బాబు కి చెప్పగా, ఆమెని పక్కన పెట్టి వేరే వాళ్ళను తీసుకోండి అని రాజమౌళి తో అన్నాడట. గతం లో కూడా మూడు సార్లు నయనతార తో మహేష్ కి సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ మహేష్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె చాలా డిమాండింగ్ గా ఉంటుంది, ఆమెతో మనం వేగలేము సార్ అని మహేష్ తన సన్నిహితులతో అనేవాడట. ఆమెనే హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడం తో ఒక డైరెక్టర్ తో మహేష్ గొడవపడిన సందర్భం కూడా ఉందట .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here