SS Kanchi : దర్శకుడు రాజమౌళి గురించి పరిచయం అవసరం లేదు. తీసిన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో ఆయనను మించిన డైరెక్టర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్లు ఉన్నారు. వీళ్లంతా రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు.
అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ల ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతుంటాయి. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు రాజమౌళి.
ఇక ఈయన ఇంట్లో రాజమౌళితో పాటుగా వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. అయినప్పటికీ ఆయన డైరెక్టర్ గా విజయం సాధించలేకపోయారు. దీంతో దర్శకత్వానికి పుల్ స్టాప్ పెట్టి రైటర్ గా స్థిరపడిపోయాడు. రాజమౌళి, తండ్రి విజయేంద్రప్రసాద్.. వీళ్లిద్దరే కాకుండా వాళ్ల ఇంట్లో మరో డైరెక్టర్ ఉన్నాడన్న విషయం చాలామందికి తెలియదు. అతని ఎవరో కాదు రాజమౌళి అన్న ఎస్ఎస్. కాంచీ. రాజమౌళి చదువుకునే రోజుల్లో కాంచీ కొన్ని కథలను చెబుతూ సినిమాలు ఇలా తీయాలి.. అలా తీయాలంటూ రాజమౌళికి భారీ రేంజ్ లో ప్లాన్స్ ఇస్తుండేవాడట. ఇంట్లో వాళ్ళందరూ కాంచీ పెద్ద డైరెక్టర్ అవుతారని అనుకున్నారట.
అయితే ఆయన తర్వాత అమృతం సీరియల్ లో కొన్ని ఎపిసోడ్‌లు కూడా డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అవుతాడని భావించారట. కానీ ఆయన డైరెక్షన్ లో మొదలైన కొన్ని సినిమాలు ఏవో కారణాలతో షూటింగ్ దశలోనే ఆగిపోయాయట.
దాంతో ఆయనకి డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ లేక రాజమౌళి సినిమాలకే చాలా వరకు హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. అలాగే బయట డైరెక్టర్లకు కూడా కొన్ని కథలను ఇస్తూ కాంచీ ఆ సినిమాలతో సక్సెస్ అవుతున్నాడట. ఇక రాజమౌళి సునీల్ ని హీరోగా పెట్టి తీసిన మర్యాద రామన్న సినిమా కూడా కాంచీ ఇచ్చిన కథే కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి సక్సెస్ కు ఆయన అన్నయ్య కాంచీ కూడా ఓ కారణమా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.