Twinkle Khanna : ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పింది. సినిమాలను విడిచిపెట్టి తన కుటుంబం ఆలనపాలన చూసుకుంటోంది. ఆమె చదువు కూడా పెళ్లితో అసంపూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్షయ్ కుమార్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. భార్య ట్వింకిల్‌తో కలిసి దిగిన ఫోటోను అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ట్వింకిల్ గ్రాడ్యుయేషన్ క్యాప్ ధరించి కనిపించింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో పాటు అక్షయ్ ఇలా రాసుకొచ్చాడు.. ‘రెండేళ్ల క్రితం నువ్వు మళ్లీ చదువుకోవాలని అనుకుంటున్నానని నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కానీ నువ్వు చాలా కష్టపడి చదివిన రోజు, నేను సూపర్ ఉమెన్‌ని వివాహం చేసుకున్నానని గ్రహించాను. నువ్వు నీ ఇల్లు, కెరీర్, పిల్లలతో పాటు విద్యార్థి జీవితాన్ని కూడా ఒకే కాలంలో నిర్వహించారు. నేను కొంచెం ఎక్కువ చదివి ఉంటే, నేడు గ్రాడ్యుయేషన్ సందర్భంగా నిన్ను పొగిడేందుకు ఇంకొన్ని పదాలు కనుక్కొనే వాడిని.. అభినందనలు.. ఐ లవ్ యూ అని రాసుకొచ్చారు.
ట్వింకిల్ ఖన్నా తన కొడుకు ఆరవ్‌తో కలిసి రెండేళ్ల క్రితం లండన్ యూనివర్సిటీలో ఫిక్షన్ రైటింగ్ మాస్టర్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. ట్వింకిల్ గ్రాడ్యుయేషన్‌ను పురస్కరించుకుని అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. అక్షయ్ కుమార్ వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. ఛోటే మియాన్ బడే మియాన్ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో తనతో పాటు టైగర్ ష్రాఫ్ కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.