Hanuman Movie : చిన్న సినిమా గా విడుదలై పెద్ద సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసుకున్న చిత్రం ‘హనుమాన్’. మహేష్ బాబు సినిమాతో పోటీ గా విడుదల అవుతుంది, పాపం ఈ సినిమా పరిస్థితి ఏమిటో అని అందరూ భయపడ్డారు. చివరికి ‘హనుమాన్’ సునామి వసూళ్ల ప్రభావం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం పై పడిన ప్రభావం చూసి పాపం ‘గుంటూరు కారం’ అని అనుకోవాల్సి పరిస్థితి వచ్చింది.
కేవలం పాతిక కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంటే దాదాపుగా 75 కోట్ల రూపాయిల లాభాల్ని చూడబోతున్నారు అన్నమాట బయ్యర్స్. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇది వరకే తెలిపాడు.
‘హనుమాన్’ చిత్రం చివరి షాట్ లో హనుమంతుడు శ్రీరాముడికి ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం దేని గురించి అనే దానిపైనే ‘జై హనుమాన్’ చిత్రం ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఈ సినిమాలో తేజా సజ్జ హీరో కాదని, తక్కువ నిడివి ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తాడని, సినిమా మొత్తం ‘హనుమంతుడే’ కనిపిస్తాడు, ఆయనకీ సపోర్టుగా నాలుగు పాత్రలు నిలుస్తాయి అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హనుమంతుడి క్యారక్టర్ మెగాస్టార్ చిరంజీవి చేస్తాడని టాక్ ఉంది.
ప్రశాంత్ వర్మ ఆయన డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడట. కానీ హనుమంతుడి పాత్ర చెయ్యాలంటే కచ్చితంగా సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి. వెండితెర మీద చూడగానే నిజంగా దేవుడు అనే అనుభూతి కలగాలి. ఈ వయస్సులో చిరంజీవి అలా ఆడియన్స్ ని ఈ పాత్ర ద్వారా మెప్పించగలడా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రశాంత్ వర్మ ఎలా చేస్తాడో చూడాలి.