Akkineni Akhil : ‘సలార్’ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన సందర్భంగా మూవీ టీం రీసెంట్ గానే బెంగళూరు లో ఒక గ్రాండ్ సక్సెస్ పార్టీ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ పార్టీ లో మూవీ టీం మొత్తం పాల్గొనగా, వాళ్ళతో పాటు అక్కినేని అఖిల్ కూడా పాల్గొన్నాడు. అయితే ఆయన చేతికి అయిన పెద్ద గాయం చూసి అందరూ షాక్ కి గురయ్యారు.
అక్కినేని అభిమానులు అయితే చేతికి ఇంత పెద్ద కట్టు కట్టుకున్నాడు, ఏమైంది మా హీరో కి అంటూ సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేసారు. రిస్కీ స్తంట్స్ చెయ్యడానికి ఎల్లప్పుడూ అమితాసక్తిని చూపించే అఖిల్ ఇప్పుడు కూడా స్టంట్ చేసి చెయ్యి విరగ్గొట్టుకున్నాడా?. రీసెంట్ ఆయన షూటింగ్స్ లో పాల్గొంటున్నట్టు ఎక్కడా కూడా వినలేదే అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ‘సలార్‘ మూవీ సక్సెస్ పార్టీ తో అఖిల్ కి ఏమిటి సంబంధం?, అక్కడేమి చేస్తున్నాడు?, ఇలా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే త్వరలోనే అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ చిత్రం చెయ్యబోతున్నాడు. ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక భాగస్వామి అనే విషయం మన అందరికీ తెలిసిందే. తన హోమ్ బ్యానర్ లో తదుపరి చిత్రం చేస్తున్నాడు కాబట్టే అఖిల్ ని ఈ పార్టీ కి ఆహ్వానించాడని సమాచారం.
ఇప్పటి వరకు కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇదంతా పక్కన పెడితే అఖిల్ కి అసలు చెయ్యి ఎలా విరిగింది అనే విషయం పై ఇంకా ఎవరికీ క్లారిటీ గా తెలియదు. రీసెంట్ గానే ఆయన బైక్ నుండి స్కిడ్ అయ్యి పడ్డాడు అని, దెబ్బలు బాగా తగిలాయని, ఆ ప్రమాదం లో ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని, త్రుటి లో ప్రాణాపాయం తప్పింది అంటూ ఒక టాక్ ఉంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి.