Sachin Tendulkar క్రికెట్ రంగం లో దిగ్గజం గా నిలిచి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, మన ఇండియా ని క్రికెట్ క్రీడలో ప్రపంచంలోనే టాప్ టీం గా నిలపడానికి తన వంతు ముఖ్య భూమికాని పోషించి భారత రత్న బిరుదుని అందుకున్న సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకించి ఏమి చెప్తాము. ఆయన గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. ప్రతీ ఒక్కరికి ఆయన జీవిత చరిత్ర, అలాగే సాధించిన విజయాల గురించి తెలుసు.
ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు కూడా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ మానేస్తే ఎన్నో లక్షల మంది క్రికెట్ చూడడమే ఆపేసారు. ఆ రంగం లో ఆయన సృష్టించిన ప్రభంజనం, ఏర్పాటు చేసిన మార్క్ అలాంటిది మరీ. ఇదంతా పక్కన పెడితే సచిన్ టెండూల్కర్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది.
అసలు విషయం లోకి వెళ్తే సచిన్ టెండూల్కర్ మన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కి మంచి సన్నిహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాలలో ఈ విషయం సచిన్ టెండూల్కర్ కూడా తెలిపాడు. ట్విట్టర్ లో కూడా అనేక సార్లు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి శుభాకాంక్షలు కూడా తెలియచేసాడు. అయితే ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఒక సినిమాలో నటించాడనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ప్రతీ స్టార్ హీరోల కెరీర్ లో కొంతవరకు షూటింగ్ ని జరుపుకొని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలా చిరంజీవి కెరీర్ లో కూడా ఒక సినిమా ఉంది.
అలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వం లో, అప్పట్లో బాలీవుడ్ లో చిరంజీవి తో ఒక సినిమా ప్రారంభించాడు. ఈ సినిమాలో సచిన్ టెండూల్కర్ చిన్న గెస్ట్ రోల్ చేసాడట. క్రికెట్ స్పోర్ట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, ఒక వ్యక్తి కాపీ రైట్ కేసు వెయ్యడం వల్ల మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలా అర్థాంతరంగా మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ బాలీవుడ్ సినిమా చెయ్యలేదు. అంతకు ముందు ఆయన ‘ఆజ్ కా గూండా రాజ్’, ‘ప్రతిబంద్’ మరియు ‘జెంటిల్ మ్యాన్’ వంటి హిందీ సినిమాల్లో హీరో గా నటించాడు. అలా సచిన్ టెండూల్కర్ అతిథి పాత్ర పోషించిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా మధ్యలోనే ఆగిపోయింది.