Guntur Kaaram : ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ముఖ్యంగా రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలు మరేమిటో కాదు తేజ హీరోగా నటించిన హనుమాన్, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. నిజానికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాని తొలత జనవరి 13వ తేదీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఎందుకో దాన్ని జనవరి 12కి షిఫ్ట్ చేశారు. అయితే హనుమాన్ సినిమా టీం పది సార్లు వాయిదా వేసుకుంటూ జనవరి 12వ తేదీ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు గుంటూరు కారం టీం కంటే ముందు హనుమాన్ టీం ప్రకటించింది.

అయితే ఇద్దరూ వెనక్కి తగ్గడానికి నిరాకరించడంతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 11వ తేదీన హనుమాన్ సినిమాకి పైడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి బుక్ మై షోలో నెగిటివ్ పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోందని సినిమా యూనిట్ భావిస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయితే నాలుగు సినిమాల్లో గుంటూరు కారం సినిమాకి మాత్రమే చాలా తక్కువ రేటింగ్ చూపిస్తోంది. ప్రస్తుతానికి గుంటూరు కారం సినిమాకి బుక్ మై షో లో 6.6 రేటింగ్ మాత్రమే ఉంది. ఇక మరో పక్క హనుమాన్ కి 9.6 ఉండగా సైంధవ్ సినిమాకి 8.5, నా సామిరంగా సినిమాకి 8.1 రేటింగ్స్ ఉన్నాయి. కావాలనే తమ సినిమా మీద పెయిడ్ నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని భావిస్తున్న గుంటూరు కారం సినిమా యూనిట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రఘుబాబు, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయి మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ముందు నుంచి సినిమా యూనిట్ భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ టీం కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.