Pawan Kalyan : చిన్న సినిమాగా విడుదలై నేడు పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్న ‘హనుమాన్’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలలో ‘గుంటూరు కారం’ చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్ళు మిగిలిన సినిమాలకు వెళ్తారని అనుకున్నారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే ఎందుకు జరుగుతాయి, విధి ఎప్పుడు ఎవరికీ అనుకూలిస్తుందో ఎవరూ చెప్పలేరు.
అందరూ ఊహించింది ఒకటి అయితే, ఇక్కడ జరిగింది మరొకటి. ‘హనుమాన్’ సినిమాకి టికెట్స్ దొరకక, జనాలు తప్పనిసరి పరిస్థితి లో మిగిలిన సినిమాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇకపోతే ‘హనుమాన్’ చిత్రంని జనవరి 12 వ తారీఖున విడుదల చెయ్యకుండా ఉండడానికి ‘గుంటూరు కారం’ మేకర్స్ మరియు బయ్యర్స్ హనుమాన్ టీంని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టారో అన్ని విధాలుగా టార్చర్ పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించే వార్త.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి పలు ఇంటర్వ్యూస్ లో పరోక్షంగానే దిల్ రాజు మరియు నిర్మాత నాగ వంశీ పై కామెంట్స్ చేసాడు. అసలు ‘హనుమాన్’ చిత్రానికి ఒక్కటంటే ఒక్క షో కూడా రాణించే ప్రయత్నం దిల్ రాజు చెయ్యగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ న్యాయం కొరకు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లాడని, తనకి జరిగిన సంఘటనలు మొత్తం వివరించగా పవన్ కళ్యాణ్ దిల్ రాజు మరియు నాగ వంశీ తో మాట్లాడి ‘హనుమాన్’ చిత్రాన్ని విడుదలయ్యేలా చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
పవన్ కళ్యాణ్ వద్దకే ఎందుకు ప్రశాంత్ వర్మ వెళ్లాడంటే ‘గుంటూరు కారం’ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పవన్ కళ్యాణ్ కి ఎంతో సన్నిహితుడు, అతను చెప్తే మాట వింటాడేమో అని ఆశ, ఆ ఆశతోనే వెళ్ళాడు, వెళ్లిన పని పూర్తి చేసుకొని వచ్చాడు. అలా ఈ సినిమా సంక్రాంతి స్మూత్ రిలీజ్ కి పవన్ కళ్యాణ్ కారణం అయ్యాడని ఒక టాక్ నడుస్తుంది.