Nayanthara : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి వార్త ఇట్టే తెలిసిపోతుంది. వారు ఏ చిన్న పొరపాటు చేసిన ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ ని అదే పనిగా టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రీసెంట్ గా హీరోయిన్ నయనతార అదే లిస్టులోకి యాడ్ అయింది. రీసెంట్ గా నయనతార ఓ గుడికి వెళ్లింది. ఆమెకు అక్కడ ఉండే సిబ్బంది ఒక నిమ్మకాయ చేతికి ఇచ్చారు. అది ఆమె ఎంతో పవిత్రంగా భావించి.. దండం పెట్టుకొని మరి జాగ్రత్తగా దాచుకుంటుంది .
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే కొందరు మాత్రం నయనతార చదువుకున్న మూర్ఖురాలు అని.. అంత పెద్ద హీరోయిన్ అయ్యి ఇలాంటివి నమ్ముతుందా ..?? అంటూ అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే అది ఆమె ఇష్టం.. ఆమె నమ్మకం మీకు ఏం రైట్ ఉందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు అంటూ నయనతారకు సపోర్టుగా ట్రోల్ చేసే వాళ్లపై విరుచుకుపడుతున్నారు. కొందరు అది మంత్రించిన నిమ్మకాయ జాగ్రత్తగా పెట్టుకుని వెళ్లూ అంటూ వెటకారంగా విమర్శిస్తున్నారు.
అయితే నయన్ ఆ నిమ్మకాయను దాచుకోవడం వెనుక ఏ రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఆమె అయితే మాత్రం బాగా ట్రోల్ అవుతోంది. అఫ్ కోర్స్ ఇది చాలా చిన్న విషయం కానీ ఆమెను ఓ రేంజ్ లో నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలను ఎంత చులకనగా చూస్తారో దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు.