Sreeleela : ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అడిగినంత డబ్బులు ఇస్తామంటే చాలు ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికి అయినా సిద్ధం అయిపోతున్నారు, అలాగే ఎలాంటి యాడ్స్ చెయ్యడానికి అయినా సై అంటున్నారు. రీసెంట్ గా తమన్నా బెట్టింగ్ యాప్ కి యాడ్ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
లక్షలాది మందిని ప్రభావితం చెయ్యగలిగే సత్తా ఉన్న సినీ సెలెబ్రిటీలు జనాలకు ఉపయోగపడేలా ప్రవర్తించాలి కానీ, చెడిపోయేలా చెయ్యకూడదు. కేవలం తమన్నా మాత్రమే కాదు, ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఇలాంటి వాటికి యాడ్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ శ్రీలీల మాత్రం అలాంటి వాటికి నో చెప్పి శబాష్ అనిపించుకుంది. ప్రస్తుతం శ్రీలీల టైం టాలీవుడ్ లో ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
పలు యాడ్స్ మరియు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా చేస్తూ ఉంటుంది కానీ, రీసెంట్ ఒక ప్రముఖ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన వాళ్ళు శ్రీలీల ని సంప్రదించి తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరారు. కానీ శ్రీలీల ఎన్ని కోట్లు ఇచ్చినా కొంతమంది లాగ డబ్బులకు కక్కుర్తి పడి ఇలాంటి యాడ్స్ చెయ్యను అండీ, వేరే ఎవరినైనా చూసుకోండి అని ముఖం మీదనే చెప్పి పంపేసిందట.
నిండా 23 ఏళ్ళ వయస్సు కూడా లేని శ్రీలీల తనని అభిమానించే వారి కోసం అలోచించి ఇంతమంచి నిర్ణయం తీసుకుంటే తమన్నా మాత్రం డబ్బులకు కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే స్థాయికి దిగజారిపోయింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.