Sankranthi Celebrations : సంక్రాంతి అంటే సినిమా ఇండస్ట్రీ కి పండగే..బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించే సీజన్. ఈ సీజన్ లో తమ సినిమాని విడుదల చేసుకోవడం కోసం సూపర్ స్టార్స్ దగ్గర నుండి చిన్న హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ థియేటర్స్ దొరకడమే కష్టం. అంతటి భయంకరమైన పోటీ వాతావరణం ఉంటుంది. అన్నీ సంక్రాంతి సీజన్స్ లాగానే ఈ సీజన్ లో కూడా నాలుగు సినిమాలు పోటీపడబోతున్నాయి.
రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మరియు ‘హనుమాన్’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ రెండిట్లో ‘హనుమాన్’ చిత్రం కంటే ‘గుంటూరు కారం’ కి మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ‘హనుమాన్’ సినిమా సెకండ్ హాఫ్ చాలా వీక్ గా ఉందని టాక్. ఇక ‘గుంటూరు కారం’ విషయానికి వస్తే, ఈ సినిమా మహేష్ అభిమానులకు ఒక పండుగ లాంటిది, కానీ మామూలు ఆడియన్స్ కి యావరేజి సినిమాగా అనిపిస్తాదట.
ఓవరాల్ గా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ని దున్నేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నాయట. ఇక జనవరి 13 వ తారీఖున విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంధవ్’ అనే చిత్రం విడుదల అవుంతుంది. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షోని మొన్ననే వేసుకొని చూసారు. ఈ షో కి ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కూడా వచ్చారట. వాళ్ళ నుండి ఈ సినిమాకి అల్ట్రా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. వెంకటేష్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న ఒక మంచి సాలిడ్ కంటెంట్ సినిమా,వెంకీ యాక్షన్ ని అదరగొట్టేసాడు అని అంటున్నారు.
అలాగే జనవరి 14 వ తారీఖున విడుదల అవ్వబోతున్న నాగార్జున ‘నా సామి రంగ’ కి కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. సంక్రాంతి మాస్ సెంటర్స్ లో ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ఈ సినిమాకే మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమాలన్నిట్లో కంటెంట్ పరంగా చూస్తే ‘సైంధవ్’ చిత్రం టాప్ లో ఉంటుందట,కమర్షియల్ గా మాత్రం ‘గుంటూరు కారం’ టాప్ లో ఉంటుందని ఇండస్ట్రీ లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.