Singer Sunitha : ఎన్నో వేల పాటలు పాడి పెద్ద సింగర్ గా పేరు తెచ్చుకున్న సునీత ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న సింగర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాల్లోనే కాదు,సీరియల్స్ లో కూడా ఈమె పాటలు పాడింది. ‘గులాబీ’ సినిమాతో ప్రారంభమైన సునీత సినీ ప్రస్థానం లో అత్యధిక శాతం హిట్ పాటలే ఉన్నాయి.
కోయిల లాంటి స్వరం తో ఎంతో లయకరంగా పాడే ఆమె పాటలు అన్నీ వయస్సులకు సంబంధించిన వారు వింటుంటారు. అందుకే ఆమె కెరీర్ ఇంకా కొనసాగుతుంది. ఈమధ్య కాలం లో ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ‘పాడుతా తియ్యగా’ ప్రోగ్రాం లో జడ్జీ గా వ్యవహరితున్న సంగతి తెలిసిందే. కేవలం ఈ ఒక్క షో మాత్రమే మాటీవీ,జీటీవీ వంటి చానెల్స్ లో కూడా ఆమె ఎన్నో షోస్ కి జడ్జీ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే కొన్ని కారణాల వల్ల మొదటి భర్త తో విడాకులు తీసుకున్న సునీత, తన 42 వ ఏటా రామ్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక సెలబ్రిటీ ఇద్దరు పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని, ఈ వయస్సు లో పెళ్లి చేసుకుంటే సమాజం ఎలా చూస్తుందో అనే భయం లేకుండా, అట్టహాసంగా అందరి సమక్షం లో ఈమె రామ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.
సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి, కానీ ఒక్కటి కూడా పట్టించుకోలేదు. అందరికీ తనదైన శైలిలో సమాధానం చెప్తూ ముందుకు పోయింది. రీసెంట్ గా వీళ్లిద్దరి పెళ్లి చేసుకొని మూడేళ్లు అయిన సందర్భంగా ‘ఈ క్షణం నా జీవితాన్ని సంతోషమయం గా మార్చేసింది’ అంటూ ఎంతో ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.