Jhanvi Kapoor : యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా దేవరా.. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాపై విడుదలైన అప్ డేట్స్ అన్నీ ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ నెలకొంది. ఈ మూవీతో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.
అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన గత సినిమాలు అన్ని సక్సెస్ సాధించడంతో దేవరపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అదేవిధంగా ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా దేవర. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దేవరా సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ వర్క్ షాప్‌ల అనిపించాయి. ఇప్పుడే హీరోయిన్ అన్న ఫీలింగ్ వస్తుంది. నా సినీ కెరీర్ దేవరతోనే మొదలవుతుందన్నట్లు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. జాన్వి చేసిన ఈ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. కొరటాల అమ్మడికి గట్టి రోల్‌నే ఇచ్చినట్లు ఉన్నాడే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు.