Lavanya Tripathi : అవును, ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ సమంతను మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫాలో అవుతుంది అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు, హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని డిసైడ్ అయిపోయిందట. అయితే అవకాశాలు వస్తుండడంతో వదులుకోలేకపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.

లావణ్య త్రిపాఠి కూడా సినీ పరిశ్రమ నుంచి తప్పుకోబోతోందని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి కొత్త వెబ్ సిరీస్ ప్రకటన అభిమానులకు టెన్షన్ క్రియేట్ చేస్తోంది. లావణ్య త్రిపాఠి తన తదుపరి వెబ్ సిరీస్ ప్రమోషన్‌లలో భాగంగా, లావణ్య త్రిపాఠి – అభిజీత్ ప్రధాన పాత్రలో నటించిన తన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ వివరాలను అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్స్ ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సిరీస్‌లో లావణ్య బోల్డ్‌గా నటించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే లావణ్య ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చివరగా అమ్ముడు సిరీస్ ని అనౌన్స్ చేయడంతో మెగా ఫాన్స్ లో కొత్త అలజడి మొదలైంది . లావణ్య ను ఈ సిరీస్ లో ఎలా చూడాల్సి వస్తుందో అంటూ భయపడిపోతున్నారు మెగా అభిమానులు.