Devil Movie Review : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ ఫుల్ రివ్యూ..ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరేలా చేసిన కొన్ని సన్నివేశాలు!

- Advertisement -

నటీనటులు: కళ్యాణ్ రామ్,సంయుక్త మీనన్ , మాళవిక నాయర్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య తదితరులు.

దర్శకత్వం : అభిషేక్ నామా
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాత : అభిషేక్ నామా, దేవాన్ష్ నామా

Devil Movie Review : నందమూరి ఫ్యామిలీ నుండి కాస్త విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చెయ్యడం లో కళ్యాణ్ రామ్ ముందు ఉంటాడు. ఆ ప్రయోగాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఆయన కెరీర్ ని రిస్క్ లో పెట్టి స్టార్ ని కానివ్వకుండా చేసింది. అయినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ కమర్షియల్ పద్దతి లో ముందుకు పోకుండా, తన మనసుకి నచ్చినట్టు సినిమాలు చేస్తూ వెళ్ళాడు. గత ఏడాది ఆయన ‘బింబిసారా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కానీ అదే ఏడాది లో విడుదలైన ‘అమిగోస్’ చిత్రం మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన రీసెంట్ ‘డెవిల్’ అనే చిత్రం చేసాడు. విభిన్నమైన కథాంశం తో తెరకెక్కిన ఈ పీరియడ్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

కథ :

బ్రిటిష్ కాలం లో నేతాజీ కి సంబంధించిన సమాచారం ని బయటకి రాబట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం ‘డెవిల్’ అనే సీక్రెట్ ఏజెంట్ ని నియమిస్తుంది. ఆయన ఈ కేసు ని విచారిస్తున్న సమయం లో ఒక రాజకుటుంబానికి చెందిన మర్డర్ కి సంబంధించి విచారణ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఈ రెండు కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయం లో డెవిల్ కి కళ్ళు చెదిరే నిజాలు తెలుస్తాయి. అదేమిటంటే రాజకుటుంబం లో జరిగిన మర్డర్ కి, డెవిల్ చేపడుతున్న సీక్రెట్ మిషన్ కి సంబంధం ఉండడమే. దీంతో బ్రిటిష్ అధికారులు డెవిల్ తో ఆపరేషన్ టైగర్ హంట్ ని ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ఆపరేషన్ కి, మర్డర్ మధ్య సంబంధం ఏమిటి?, డెవిల్ తన ప్రాణాలకు తెగించి ఈ మిషన్ పూర్తి చెయ్యడానికి గల కారణం ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్రానికి తొలుత నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అతను ఈ సినిమా నుండి తప్పుకోగా, నిర్మాత అభిషేక్ నూమా దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరమైన లైన్ తోనే ప్రారంభం అవుతుంది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అదిరిరిపోయాయి. సినిమా కోర్ పాయింట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, ట్విస్టులు ఆడియన్స్ ముందుగా ఊహించినట్టుగానే స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఆడియన్స్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ని మిస్ అయ్యారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. కానీ ఆసక్తికరంగా సాగుతున్న స్టోరీ లో పాటలు స్పీడ్ బ్రేకర్ లాగ అనిపించింది. ఇక కళ్యాణ్ రామ్ మరియు సంయుక్త మీనన్ మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా లేదు. థ్రిల్ కి గురి చెయ్యాల్సిన సన్నివేశాలు మొత్తం తేలిపోయాయి. అందుకే డైరెక్టర్ మారితే సినిమా ఫలితాలు తేడా కొడుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు, ఈ సినిమాకి అదే జరిగింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ చాలా సెటిల్ గా చేసాడు. ఇన్వెస్టిగేషన్ జానర్స్ కళ్యాణ్ రామ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతాడు అని ఈ సినిమాని చూసినప్పుడు అందరికీ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది కానీ, డైరెక్టర్ ఆమె క్యారక్టర్ ని ఇంకా బాగా రాసుకుంటే బాగుండును అని అనిపించింది. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ క్యారక్టర్ కూడా ఇంతే , సినిమాలో పెద్ద ప్రభావం ఏమి చూపించదు. మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ గా మలిచే స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో డైరెక్టర్ ఆ విషయం లో ఫెయిల్ అయ్యాడు అని అనిపించింది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు ఒక్కటి కూడా వినసొంపుగా లేవు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సన్నివేశాలకు బాగా కొట్టాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.

చివరి మాట :

ఓవరాల్ గా ఈ చిత్రం ఒక డీసెంట్ థ్రిల్లర్ అనే చెప్పాలి. కానీ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో డైరెక్టర్ సరిగా ఫోకస్ చెయ్యలేదు అనిపించింది.

రేటింగ్ : 2.5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here