Vaishnavi Chaitanya : బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది క్యూట్ బ్యూటీ వైష్ణవి చైతన్య. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బస్తీ అమ్మాయిగా, మోడ్రన్ బ్యూటీగా ఆకట్టుకుంది. ఆమె అద్భుత నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. ఈ మూవీతో పాటు మరో క్రేజీ ఆఫర్ కు ఓకే చెప్పింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా ఎంపిక అయ్యింది .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. నిజానికి ‘బేబీ’ సినిమా తర్వాత వైష్ణవి వెంటనే అవకాశాలు రాలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ‘బేబీ’ కాంబోలోనే సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. సాయి రాజేష్ ఈ సినిమాకు కథను అందించారు. నంబూరు రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.