Vijayakanth:ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్నుమూశారు. తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి అధికారికంగా ప్రకటించింది.. దీంతో యోట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలిసుల మోహరించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా విజయకాంత్ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ప్రస్తుతం ఆయనకు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. విజయ్ కాంత్ మరణ వార్త తెలిసిన ఆయన అభిమానులు, డీఎండీకే నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి పోటెత్తుతున్నారు.
గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ పార్టీ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సెప్టెంబరు 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డిసెంబర్ 11న డిశ్చార్జి అయ్యాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో విజయకాంత్ పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి మళ్లీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు.తాజాగా కరోనా ఇన్ఫెక్షన్‌గా డీఎండీకే ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయమే ఆయన మరణించినట్లు ప్రకటించారు.