Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయ్యి ఆరు నెలలు అయ్యింది. సినిమాకి టైటిల్ కూడా పెట్టకముందే 160 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ అలాంటిది.

ఆ కాంబినేషన్ కి తోడు సంక్రాంతి సీజన్ తోడు అయితే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి. అందుకే ‘గుంటూరు కారం’ కి ఆ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ అప్పట్లో ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పుడు ఈ చిత్రానికి లేదనే చెప్పాలి. టీజర్ మరియు టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ రీసెంట్ గా విడుదలైన ‘ఓ మై బేబీ’ సాంగ్ మాత్రం పూర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ పాటని విన్నప్పటి నుండి ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ పై వేరే లెవెల్ లో విరుచుకుపడ్డారు. సినిమాకి ఉన్న హైప్ మొత్తం పోవడానికి కారణం నువ్వే, ఏమి పాపం చేస్తే మాకు తగులుకున్నావు అంటూ తమకి తెలిసిన బూతులతో థమన్ ని దంచికొడుతున్నారు. మరో పక్క మహేష్ బాబు కూడా థమన్ పనితనం పై కోపం గా ఉన్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా ‘ఓ మై బేబీ’ సాంగ్ అసలు బాగాలేదని, వెంటనే సినిమా నుండి తొలగించండి అంటూ నిర్మాతలకు చెప్పాడట. దీనికి థమన్ మనసు కూడా బాగా నొచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఒక సినిమాలో అన్నీ పాటలు నచ్చాలని లేదు. అలా నచ్చని పాటలు తొలగిస్తూ పోతే ఇక మేము ఉన్నది ఎందుకు, నచ్చకపోతే మంచి ట్యూన్ వచ్చే వరకు నా చేత కొట్టించుకోవాలి అని థమన్ మహేష్ ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన స్నేహితులతో చెప్పుకున్నాడట.
