Guntur Kaaram : ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రాగ, పాటలకు మాత్రం అనుకున్న స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.
![Guntur Kaaram](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-677-1024x614.png)
మహేష్ బాబు కూడా థమన్ అందించిన ఈ ట్యూన్స్ పై మొదటి నుండి సంతృప్తి గా లేడు. త్రివిక్రమ్ మరియు థమన్ కాంబినేషన్ అంటే ప్రతీ ఒక్కరు అలా వైకుంఠపురం రేంజ్ పాటలను ఊహిస్తాడు. కానీ ‘గుంటూరు కారం’ చిత్రం పాటలు అందులో పావు శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ కూడా అనుకున్న రేంజ్ లో లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఉంది.
![Mahesh Babu](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-678-1024x576.png)
సినిమా ప్రారంభం 15 నిముషాలు, అలాగే చివరి 20 నిమిషాలు తప్ప మధ్యలో సినిమా మొత్తం చాలా రొటీన్ గా ఉందని, ఆశించిన స్థాయిలో లేదని ఒక టాక్ వినిపిస్తుంది. కేవలం సంక్రాంతి ఫ్యాక్టర్ మరియు మాస్ కమర్షియల్ సినిమా అనే సెంటిమెంట్ తప్ప చిత్రం లో ఏమి లేదని, మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత థమన్ ని మరియి త్రివిక్రమ్ ని ఒక రేంజ్ లో తిడుతారు అంటూ టాక్ వినిపిస్తుంది.
![Guntur Kaaram Movie](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-679.png)
సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం ఒక్క సాంగ్ షూటింగ్ తప్ప మొత్తం అయిపోయిందట. ఈమధ్య వస్తున్న మహేష్ సినిమాలు కంటెంట్ పెద్దగా లేకపోయినా, కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగ్గా ప్లేస్ అవ్వడం వల్ల, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ‘గుంటూరు కారం’ చిత్రం కూడా అదే విధంగా ఆడేస్తుందని అనుకుంటున్నారు, చూడాలి మరి.