Prabhas : పాన్ ఇండియా ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. డిసెంబర్ 22న సలార్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినీ కెరీర్‌ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని నిర్వచించవచ్చు. తండ్రి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థ, పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ నుంచి వారసుడిగా ప్రభాస్ సినిమాల్లోకి తెరంగేట్రం చేశాడు.
![Prabhas](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/prabhas2-1-1024x576.webp)
కానీ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొదటి సినిమా ఈశ్వర్‌కే ఉపయోగపడింది. అనంతరం ఎంతో కష్టపడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.2014-15 అంటే బాహుబలి రెండు చిత్రాలకు ముందు ప్రభాస్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. అప్పుడు ప్రభాస్ నెట్ వర్త్ సుమారు రూ. 124 కోట్లు (15 మిలియన్ డాలర్స్)గా ఉన్నట్లు అంచనా. బాహుబలి తర్వాత ప్రభాస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
![Prabhas Photos](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/prabhas1-1-1024x768.webp)
దీంతో ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా రికార్డుకెక్కాడు. ప్రభాస్ ఆదిపురుష్ కోసం రూ. 100 నుంచి 120 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ కోసం రూ. 150 కోట్లు, ఇప్పుడు సలార్‌కు రూ. 100 కోట్లతో పాటు లాభాల్లోంచి 10 శాతం తీసుకోనున్నాడట.