Vennela Kishore : టాలీవుడ్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో వెన్నెల కిషోర్ కచ్చితంగా ఉంటాడు. సునీల్ తర్వాత మన టాలీవుడ్ కి ఆ రేంజ్ కమెడియన్ లేడనే అసంతృప్తి అప్పట్లో ఆడియన్స్ లో ఉండేది. కానీ వెన్నెల కిషోర్ క్లిక్ అవ్వడం తో టాలీవుడ్ ఆడియన్స్ అతనికి బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ లేని సన్నివేశాలను కూడా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోతాడు.
ఇదే అతనికి అన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుంది. ఇండస్ట్రీ లో దాదాపుగా ప్రతీ హీరోతోనూ వెన్నెల కిషోర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ ఈమధ్య కాలం లో అతను నాగ చైతన్య కి చాలా దూరం గా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అతనితో కలిసి సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా కూడా వెన్నెల కిషోర్ రిజెక్ట్ చేస్తున్నాడట. దానికి ఒక కారణం కూడా ఉంది.
అసలు విషయానికి వస్తే వెన్నెల కిషోర్ సమంత కి ప్రాణ స్నేహితుడి లెక్క మారిపోయాడు. చాలా కాలం నుండి సమంత ఇతనికి ఎంతో దగ్గర అయ్యింది. ఇద్దరు ఒకరి బాధలను ఒకరు పంచుకుంటారు, అంతటి మంచి రిలేషన్ వీళ్ళ మధ్య ఏర్పడింది. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య సమంత కి విడాకులు ఇచ్చాడో, అప్పటి నుండి వెన్నెల కిషోర్ కి నాగ చైతన్య మీద కోపం ఉందట. తన స్నేహితురాలికి అన్యాయం చేసాడు అనే భావన వెన్నెల కిషోర్ లో ఉండేదట.
అందుకే అతను నాగ చైతన్య కి దూరం గా ఉంటూ వస్తున్నాడని ఫిలిం నగర్ లో ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది. సమంత మరియు నాగ చైతన్య కి విడాకులు జరిగిన తర్వాత వెన్నెల కిషోర్ కేవలం అతనితో రెండు సినిమాలు మాత్రమే చేసాడు. ఒకటి బంగార్రాజు కాగా, మరొకటి కస్టడీ. ఈ రెండు సినిమాలు ఎప్పుడో కమిట్ అయిపోయాడు కాబట్టి చెయ్యాల్సి వచ్చిందట. ఆ తర్వాత మళ్ళీ వెన్నెల కిషోర్ నాగ చైతన్య సినిమాలకు సంతకం చెయ్యలేదు.