Gossips : హీరోయిన్ కమ్ ఐటమ్ డ్యాన్సర్ లక్ష్మి రాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1989లో కర్ణాటకలోని బెల్గామ్ లో జన్మించింది. తనకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ మొదటిగా విజయ్ నటించిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక దీనితోపాటు తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో శ్రీకాంత్ సరసన కలిసి నటించింది. ఈమె నటించిన తొలి రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.
ఇలా 2005 నుంచి 2008 వరకు 12 సినిమాల్లో నటించినప్పటికీ ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. ఇక ఇలాంటి సమయంలోనే కేరళకు వెళ్లి అక్కడ మూవీస్ తీయడంతో ఈమెకు అక్కడ పలువురితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంది. లక్ష్మి రాయ్ క్రికెటర్ శ్రీశాంత్ ను ఒక అవార్డు ఫంక్షన్లో కలిసింది. దాంతో వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త డేటింగ్ వరకు వెళ్లింది. ఇలా శ్రీశాంత్ సాయంతో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా క్రికెటర్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్లో లక్ష్మీరాయ్ కి పరిచయం అయ్యాడు.
ఇక ఫస్ట్ మీటింగ్ లోనే వీరిద్దరూ క్లోజ్ అయ్యి డ్యాన్స్ చేసిన దృశ్యాలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా గుప్పుమన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ కూడా చేసారంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే ధోని లక్ష్మి రాయ్ ని.. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే సినిమాలలో నటించడం మానేయమని ఓ కండిషన్ పెట్టాడట. దీనికి అప్పుడు లక్ష్మీరాయ్ నో చెప్పిందట. ఇక ఈ తరుణంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు… ‘ఫుల్ గా వాడేసుకుని వదిలేసావు కదా బ్రో ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.