Daggubati venkatesh : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా సొంత టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఆయన నటించిన ప్రతి సినిమా మినిమం హిట్ గ్యారంటీ కార్డు వేసుకోవడంతో విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పెద్దగా సినిమా రంగంలో కనబడడం లేదు వెంకటేష్. ఈ క్రమంలోనే ఈయన సీక్రెట్ విషయాలను బయటకు లాగి ట్రెండ్ చేస్తున్నారు జనాలు.
ఈ నేపథ్యంలోనే ఈయన ఆస్తుల విలువ గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్, నీరజారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు. తన పెద్ద కూతురికి మొన్నీ మధ్యనే ఘనంగా పెళ్లి కూడా జరిపాడు వెంకటేష్.
మరొకవైపు తన తండ్రి రామానాయుడు ఏర్పాటు చేసిన.. సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియోలో తన అన్నతో పాటు వెంకటేష్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వెంకటేష్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. ఆయనకు రూ.2 వేల కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు వెంకటేష్ రెమ్యునరేషన్ కింద రూ. 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అవి కాకుండా ఈయనకి తన తండ్రి నుంచి వారసత్వంగా కూడా కొన్ని ఆస్తులు లభించినట్లు తెలుస్తుంది. అన్నీ కలుపుకుంటే వెంకటేష్ ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉందటని ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.