Rakul Preet Singh: ట్రెండీ వేర్​లో రకుల్ ప్రీత్ సింగ్​ పోజులు.. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ చూశారా..?

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సూపర్ హిట్ మూవీస్​తో దూసుకెల్తోంది. ఓవైపు సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోలతో నటిస్తూ.. మరోవైపు రామ్​చరణ్, ఎన్టీఆర్ వంటి ప్యాన్ ఇండియా హీరోలతో జతకడుతూ.. నాగార్జున వంటి సీనియర్లతోనూ నటిస్తోంది. మొన్నటిదాకా టాలీవుడ్​ను ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్​లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుస సినిమాలతో అక్కడ చాలా బిజీ అయింది Rakul Preet Singh. తరచూ బాలీవుడ్ ఈవెంట్లలో తన బాయ్​ఫ్రెండ్​ జాకీ భగ్నానీతో కలిసి చక్కర్లు కొడుతోంది.

rakul preet singh photos

ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ సెన్సేషనే. సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

- Advertisement -

Rakul Preet Singh

 

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్​స్టా ఖాతాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తాను ఎల్లో కలర్ మినీ స్కర్ట్ విత్ బ్లేజర్ ధరించింది. బ్లేజర్ కింద రకుల్ వైట్ కలర్ మెష్ టాప్ వేసుకుంది. స్నీకర్స్.. ట్రెండీ ఇయర్ రింగ్స్ తో రకుల్ ఈ లుక్ ని మరింత అట్రాక్టింగ్ గా మార్చేసింది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మై లెమనాయిడ్.. యూ ఆర్ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Rakul Preet Singh Pics

రకుల్ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసిన ఫొటోల్లో ఆరెంజ్ కలర్ సూట్​లో మెరిసిపోతోంది. యాంటీథీసిస్ బ్రాండ్​ ప్యాంట్​సూట్​లో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది. సెలెబ్రిటీ స్టైలిష్ట్ సనమ్ రత్నాసీ రకుల్​ని ఇంత కూల్​గా రెడీ చేశాడు.

Rakul Preet Singh

డెనిమ్ జీన్స్​లో వైట్ టాప్​లో రకుల్ లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలో రకుల్ చాలా బ్యూటీఫుల్​గా కనిపిస్తోంది. యూ ఆర్ మై డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోల కింద తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here