Sai Pallavi: ఇప్పటికీ తండ్రి మాటే వింటున్న స్టార్ హీరోయిన్.. అదే తన సక్సెస్ సీక్రెట్ అట

- Advertisement -


Actress : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. సాయి పల్లవి సినిమాల కంటే తన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానాన్ని దక్కించుకుంది. ముందు నుంచి సాయి పల్లవి కథల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది. డబ్బులు కోసం ఏది పడితే అది ఒప్పుకోదు.

ఆమె ఒక సినిమాకు ఓకే చెప్పిందంటే.. అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వస్తున్న సాయి పల్లవి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఆమె వ్యక్తిత్వమే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. నాకు మొదట నటనపై అసలు ఆసక్తి లేదని.. అయితే ప్రేమమ్‌ సినిమా ఆఫర్ రావడంతో ఇంట్లో వాళ్లు కూడా షాక్ అయ్యారని చెప్పుకొచ్చింది.

అప్పుడు మా నాన్న ఒకటే మాట చెప్పారు. జీవితం ఎటువైపు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. అయితే ఒకటి గుర్తుంచుకో మనం ఎక్కడ ఉన్నా గౌరవంగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, గౌరవంగానే వెళ్ళిపోవాలి అంటూ చెప్పుకొచ్చారు. నాకు ఈ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ మా చిన్నది గోల్డ్ అంటూ, బంగారం అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here