Ravi Teja : సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో కాస్త అవుట్ అండ్ అవుట్ గ్లామర్ రోల్స్ చేసినా.. తర్వాతర్వాత కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి మూవీ అనుష్క కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఆ ఒక్క సినిమాతోనే విక్రమార్కుడు, బాహుబలి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే అవకాశాలను అనుష్క దక్కించుకుంది.
ఇక ఇండస్ట్రీలో తన 15 సంవత్సరాల సిని ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అనుష్క ఒక నటిగానే కాకుండా వ్యక్తి గతంగా కూడా చాలా మంచిదనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన మంచితనం గురించి చూశాం.. విన్నాం కూడా. అయితే ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్, అనుష్క గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ అంటుంటారు అనుష్క మంచిది.. మంచిది అని. నిజంగా తాను చాలా మంచిది. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
ఎంతలా అంటే నేను, ఛార్మి, రవితేజ తనని అమ్మ అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఎందుకంటే తనలోని మంచి లక్షణాల్లో కొన్ని అయినా మాకు రావాలని. చాలా మంచితనం తెలివి కల అమ్మాయి అనుష్క ” అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. స్టార్ హీరో రవితేజ సైతం అనుష్క కాళ్లు పట్టుకునే అంత మంచిదట అమ్మడు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.