Amruta Subhash : మా ఆయనే నన్ను అలాంటి సీన్స్ నువ్వు చేయాలని పంపుతున్నారు.. హీరోయిన్ ఆవేదన

- Advertisement -


Amruta Subhash : ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ మీకు తెలుసా? ఈ సంకలనంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. మరో కథలో ప్రముఖ నటి అమృతా సుభాష్ కూడా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించారు. ఆంథాలజీలో ఆ ఎపిసోడ్ కు మరో బాలీవుడ్ హీరోయిన్ కొంకణాసేన్ శర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ సీన్లు చేయడానికి తాను ఇబ్బంది పడినా.. తన భర్తే నువ్వు బాగా చేయగలవంటూ ఎంకరేజ్ చేసినట్లు తాను చెప్పుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ యాక్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో అమృతా సుభాష్ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. లస్ట్ స్టోరీస్ 2లో ఆమె భర్త పాత్రను శ్రీకాంత్ యాదవ్ పోషించాడు. అతడు చాలా ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని అలాంటి వ్యక్తితో ఇంటిమేట్ సీన్లు చేయాలి అనగానే మొదట భయపడినట్లు తెలిపారు.

Amruta Subhash
Amruta Subhash

అమృతా సుభాష్‌ మాట్లాడుతూ – స్క్రిప్టు చదవగానే ఇందులో ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్నాయనిపించింది. వాటిని చూసి భయపడ్డాను. ఆ సీన్లు చేసే ముందు శ్రీకాంత్‌తో ఒక రోజు గడపాలని దర్శకురాలు కొంకణాసేన్ శర్మకు చెప్పాను. ఇందులో నా భర్త పాత్రలో నటించిన శ్రీకాంత్ యాదవ్ నాకు చాలా ఏళ్లుగా ప్రాణ స్నేహితుడు. అతను నా భర్త స్నేహితుడు కూడా.

Amruta Subhash MOvies

అలాంటి వ్యక్తితో ఇలాంటి సీన్లు అంటే భయమేసింది. నీతో అలాంటి సీన్లు చేయలేనని శ్రీకాంత్ యాదవ్ కూడా చెప్పాడు. అప్పుడు నువ్వు చేయగలవని నా భర్తే నన్ను దగ్గరుండి ప్రోత్సహించాడు. ఆ తర్వాత షూటింగ్‌కు ముందు కొంకణా సేన్ బెడ్‌రూమ్‌లో రోజంతా గడిపాం. అన్ని యాంగిల్స్‌లో ఎలా ఉంటుందో కూడా చూశాం. మాతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నారని అమృత సుభాష్ అన్నారు. నెట్‌ఫ్లిక్స్ యాక్టర్ రౌండ్ టేబుల్‌లో అమృతతో పాటు కరీనా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, సన్యా, తిలోత్తమ, జైదీప్ అహ్లావత్ వంటి వారు పాల్గొన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here