Vaishnavi Chaitanya : యూట్యూబ్ లోని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ల ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న నటి వైష్ణవి చైతన్య. ఈమె నటించిన వెబ్ సిరీస్ లలో ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత ఆమెకి టాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వచ్చాయి. తొలుత చిన్న చిన్న పాత్రలే వచ్చినప్పటికీ, ఆ తర్వాత ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ ఛాన్స్ ని దక్కించుకొని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

ఈ సినిమా ఆమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిందో మనమంతా చూసాము. కచ్చితంగా ఆమె పెద్ద రేంజ్ కి వెళ్తుంది అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చారు. రీసెంట్ గానే సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించే సినిమాలో హీరోయిన్ రోల్ ని సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య కి మరో బంపర్ ఆఫర్ దక్కింది.

సౌత్ ఇండియా లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకొని హీరోలతో సమానమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న సమంత రీసెంట్ గానే ‘ట్ర-లా-లా’ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ఆమె కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే తన వద్ద పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలలో ఒకటి ఎంచుకొని సినిమాని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి క్యాస్టింగ్ కూడా సిద్ధం అయ్యినట్టు సమాచారం.
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటన సమంత ఎంతగానో నచ్చిందట. అందుకే ఆమెని తానూ నిర్మించాబోయ్యే మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ముందుకొచ్చింది అట. రీసెంట్ గానే ఆమెతో సంప్రదింపులు జరిపి కోటి రూపాయిల అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చిందట సమంత. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇంత రెమ్యూనరేషన్ ని వైష్ణవి చైతన్య ఇన్ని రోజులు కలలో కూడా చూసి ఉండదు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.