Anushka sharma : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకసారి షాంపూ యాడ్‌లో కలిసి నటిస్తూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరిద్దరూ తమ పెళ్లిని చాలా రహస్యంగా చేసుకున్నారు. ఇద్దరికీ ఒక కూతురు కూడా పుట్టింది. అలాగే అనుష్క ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క శర్మ రాహుల్‌ను పెళ్లి చేసుకుంది, విరాట్ కోహ్లీని కాదు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అనుష్క శర్మ మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. అయితే మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలనే ఉద్దేశ్యంతో పెళ్లిని సీక్రెట్‌గా చేసుకున్నాం.
విరాట్ కోహ్లీ సెలబ్రిటీ కాబట్టి, అతని పేరు ఎక్కడ బయటకు వస్తుందనే ఉద్దేశ్యంతో విరాట్ కోహ్లీ పేరును రాహుల్‌గా మార్చాము. విరాట్ పేరు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సెలబ్రిటీల పెళ్లిలా కాకుండా సామాన్యుడు ఎలా పెళ్లి చేసుకుంటాడో అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని చెప్పుకొచ్చింది అనుష్క శర్మ. ఈ విషయం విన్న వారు అనుష్క విరాట్‌ని పెళ్లి చేసుకోలేదా ?… రాహుల్ చేసుకుందా ?.. అని ఆశ్చర్యపోతున్నారు.