Bigg Boss Telugu : అమర్ నాగార్జున ని అడిగిన ఈ టీ – షర్ట్ విలువ ఎన్ని లక్షల్లో తెలిస్తే నోరెళ్లబెడుతారు.. అందుకే ఇవ్వను పో అన్నాడా?

- Advertisement -

Bigg Boss Telugu : ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ యంగ్ గా కనిపించే హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అక్కినేని నాగార్జున. సుమారుగా మూడు దశాబ్దాల నుండి ఆయన ఇవే లుక్స్ ని మైంటైన్ చేస్తూ వచ్చాడు. ఆయన తీసుకునే డైట్స్, చేసే వర్కౌట్స్ వల్లే ఇంత గ్లామర్ గా ఉండడానికి కారణం అని అంటుంటారు ఫ్యాన్స్. నాగార్జున కూడా అనేక సందర్భాలలో తన అందం సీక్రెట్ ఇదేనంటూ సమాధానం కూడా ఇచ్చాడు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

అంతే కాదు నేటి తరం యువతకి నచ్చే విధంగా నాగార్జున పాటించే స్టైలింగ్ ని యూత్ తెగ ఫాలో అవుతూ ఉంటారు. సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా ఆయన ఇదే రేంజ్ స్టైలింగ్ ని మైంటైన్ చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో లో వీకెండ్స్ అప్పుడు ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.

Nagarjuna

గత వీకెండ్ లో నాగార్జున ఎల్లో కలర్ టీ షర్ట్ లో ఎంతో అందం గా కనిపించాడు. ఈ షర్ట్ ని హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్ అమర్ దీప్ ‘సార్ నాకు ఒక చిన్న కోరిక..మీ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది..నాకోసం అది ఇస్తారా’ అని అడుగుతాడు. అప్పుడు నాగార్జున ‘గమ్ముగా కూర్చో’ అంటాడు. ఆ తర్వాత శివాజీ ‘నువ్వు మారవు రా..బాబు గారి సైజు ఏంటి..నీ సైజు ఏంటి..నీకు పట్టదు,వేసుకుంటే మునిగిపోతావు’ అని అంటాడు.

- Advertisement -
Akkineni Nagarjuna

ఇదంతా పక్కన పెడితే ఈ చొక్కా విలువ అక్షరాలా రెండు లక్షల రూపాయిలకే పైగానే ఉంటుందట. అప్పుడు నాగార్జున ఇవ్వను అన్నట్టుగా మాట్లాడాడు కానీ, అమర్ దీప్ కోసం ప్రత్యేకంగా ప్యాక్ చేయించి, బిగ్ బాస్ హౌస్ లో ఆయనకీ బహుమతిగా పంపాడట. నాగార్జున చూపించి ఈ స్వీట్ గెస్చర్ కి అమర్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here