Vijay Antoni : తమిళనాడు లో మీడియం రేంజ్ హీరోగా తనకంటూ ఒక మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు విజయ్ ఆంటోనీ. ఆయన హీరో గా నటించిన బిచ్చగాడు చిత్రం తెలుగునాట ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము. రీసెంట్ గానే ఈ ఏడాది బిచ్చగాడు 2 విడుదల అయ్యింది. టాక్ పెద్దగా రాకపోయినా కూడా ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళింది అంటే బిచ్చగాడు మూవీ బ్రాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అలా విభిన్నమైన కథాంశాలతో రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరం గా ఉండే విజయ్ ఆంటోనీ కి ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. తన రెండవ కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, తానూ నటించిన లేటెస్ట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వంటివి విజయ్ ఆంటోనీ కి ఆయన అభిమానులకు నిరాశని మిగిలించింది.
ఇది ఇలా ఉండగా ఇన్నేళ్ల విజయ్ ఆంటోనీ కెరీర్ లో ఒక్కసారి కూడా అతని గురించి తప్పుగా రూమర్స్ రావడం ని ఎవ్వరూ గమనించలేదు. అంత క్లీన్ ఇమేజి ని మైంటైన్ చేస్తూ వచ్చిన విజయ్ ఆంటోనీ మీద కూడా కొంత కాలం క్రితం ఒక రూమర్ సోషల్ మీడియా లో తెగ ప్రచారం అయ్యింది. విజయ్ ఆంటోనీ తన భార్య ఫాతిమా కి విడాకులు ఇవ్వబోతున్నాడు అని, అనుయా అనే హీరోయిన్ తో ఆయన చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నాడని, త్వరలో రెండవ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ రకరకాలుగా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది.
దీనికి అనుయా రీసెంట్ గా జరిగిన ఇంస్టాగ్రామ్ లైవ్ లో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు విజయ్ ఆంటోనీ కి కావాలని సంబంధం పెట్టారు.. మేమిద్దరం ప్రేమించుకోలేదు, సోషల్ మీడియా లో వచినవాణ్ణి అబద్దాలే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అనూయా బిగ్ బాస్ సీజన్ 1 తమిళ వెర్షన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది.