Amardeep : ఈ వీకెండ్ లో జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎట్టి చూపుతూ వాళ్ళని కడిగిపారేసిన విధానం ఈ సీజన్ లో ది బెస్ట్ అనే చెప్పాలి. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పట్ల వ్యవహరించిన ప్రవర్తన, శివాజీ ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడిన విధానం, అలాగే పల్లవి ప్రశాంత్ ఆడిన సింపతీ డ్రామా, ఇలా అన్నిటినీ కడిగి పారేసాడు.
ముఖ్యంగా అమర్ దీప్ మరియు శివాజీ కి చాలా బలమైన కోటింగ్ పడింది. ఆడియన్స్ వాళ్లకి సరైన కోటింగ్ పడాలి అనుకున్నారు, వాళ్ళ అంచనాలకు నాగార్జున రీచ్ అయ్యాడు అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్ మొన్న ఆవేశం లో పల్లవి ప్రశాంత్ ని తొయ్యడం గురించి చాలా బలంగా నిలదీసాడు. ఆ సంఘటన కారణంగా అమర్ కి సోషల్ మీడియా లో నెగటివిటీ బాగా పెరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే.
ముందుగా ప్రియాంక ని పిలిచి అమర్ దీప్ ప్రశాంత్ పట్ల వ్యవహరించిన తీరు ఎలాంటిది అని అడగగా, ప్రియాంక అందుకు సమాధానం చెప్తూ ‘కరెక్ట్ కాదు సార్, ఇది నేను ఈ సంఘటన జరుగుతున్న సమయం లోనే అమర్ కి చెప్పాను. ఏవేవో బూతులు మాట్లాడాడు, వాటి అర్థం కూడా నాకు తెలియదు. రెచ్చగొడితే రెచ్చిపోతావా?, ఇది కరెక్ట్ కాదు కంట్రోల్ లో ఉండు అని కూడా చెప్పాను’ అని అంటుంది.
అప్పుడు నాగార్జున ‘నువ్వు అంతగా చెప్పిన తర్వాత కూడా అతను వినకపోతే ఏమంటారు అమ్మా?, పిచ్చ నాకొడుకు అని అంటారు..ఇది నేను చెప్పింది కాదు, తనని తాను తిట్టుకున్నదే’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ’15 వారాలు అయ్యింది..ఇప్పటికీ కూడా నువ్వు మారకుంటే నువ్వు నిజంగా పిచ్చ నాకొడుకువే’ అంటూ అమర్ దీప్ కి చెప్పుకొచ్చాడు. ఈ ఎపిసోడ్ లో అమర్ కి చెడుగా ఏమి జరగలేదు, ఎందుకంటే అతను చేసిన తప్పు కోట్లాది మంది తెలుగు ప్రజలు చూసారు, అంతా ఓపెన్ గానే చేసాడు. కానీ పల్లవి ప్రశాంత్ ఆడిన సింపతీ డ్రామా మాత్రం, ఈరోజే ప్రపంచానికి తెలిసింది.