AmarDeep : శోభా శెట్టి తో అమర్ దీప్ పెద్ద గొడవ.. రోజు రోజుకి పిచ్చోడు అయిపోతున్న అమర్!

- Advertisement -

AmarDeep తెలిసి చేస్తున్నాడో, తెలియకుండా చేస్తున్నాడో అర్థం కావడం లేదు కానీ, గత కొద్దిరోజుల నుండి ఓవర్ అగ్రెస్సివ్ అయిపోతున్నాడు. అయితే ఒక్కసారిగా ఘోరంగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తున్నాడు, అదృష్టం కలిసొచ్చి అది అమర్ కి పాజిటివ్ అయ్యింది. కానీ ఇప్పుడు పూర్తిగా సహనం కోల్పోయి తనని తానూ ఏమైనా చేసేసుకుంటాను అని నిన్న ప్రశాంత్ ని బెదిరించడం చూసి అమర్ ఫ్యాన్స్ కూడా భయపడిపోయారు.

AmarDeep
AmarDeep

ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా సహనం కోల్పోయి అమర్ తన గ్రాఫ్ ని మొత్తం తగ్గించేసుకుంటున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కెప్టెన్సీ టాస్కు సమయం లో అమర్ కి అన్యాయం జరిగినప్పుడు ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఆయనకీ తెగ ఓటింగ్ కూడా పడింది. కానీ పల్లవి ప్రశాంత్ తో గొడవలు మళ్ళీ మొదలయ్యాక ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. ఇక ఎప్పుడైతే తన స్నేహితురాలు ప్రియాంక తో గొడవ జరిగిందో అమర్ గ్రాఫ్ మరింత తగ్గిపోయింది.

AmarDeep BIgg Boss

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే అమర్ శోభా శెట్టి తో నిన్న ప్రశాంత్ తో ఏ రేంజ్ లో అయితే గొడవ పడ్డాడో, అదే రేంజ్ లో గొడవపడ్డాడు అట. వోట్ ఫర్ అప్పీల్ లో భాగంగా జరిగిన ఒక టాస్కులో అమర్ మరియు శోభా శెట్టి పెద్ద ఎత్తున గొడవ పడినట్టుగా టాక్ వినిపిస్తుంది. అమర్ ప్రస్తుతం ఉన్న మానసిక స్థితికి చాలా తేలికగా నోరు జారేస్తున్నాడు కాబట్టి తప్పు ఆయన వైపే ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు.

- Advertisement -
AmarDeep Shoba SHetty

కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అనే రేంజ్ కి దూసుకొచ్చిన అమర్ దీప్, ఇప్పుడు ఓటింగ్ గ్రాఫ్ లో రెండు మరియు మూడవ స్థానం మధ్యలో ఉన్నాడని, ఇక ఈరోజుతో టాస్కులు మొత్తం పూర్తి అయిపోయాయి కాబట్టి ఇక అమర్ తన గ్రాఫ్ ని పెంచుకునే స్కోప్ ని కూడా పోగొట్టుకున్నాడు అని, విన్నర్ రేస్ పక్కన పెడితే రన్నర్ రేస్ లో కూడా స్థానం కోల్పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here