Sreeleela కి అసలు యాక్టింగ్ చెయ్యడమే రాదు అంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల కి ఏ రేంజ్ క్రేజ్ మరియు డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె కాల్ షీట్ దొరకడం ఒక అదృష్టం అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ క్లిక్ అయితే ఇలాగే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ వేరే కొత్త హీరోయిన్ రాగానే అప్పటి వరకు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ని పక్కన పెట్టేస్తారు.

Sreeleela
Sreeleela

శ్రీలీల ఇండస్ట్రీ లోకి రాకముందు మన టాలీవుడ్ లో పూజా హెగ్డే మరియు రష్మిక మండన టాప్ 2 స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే శ్రీలీల మేనియా ప్రారంభం అయ్యిందో, ఈ ఇద్దరు హీరోయిన్లు కనిపించకుండా పోయారు. టాలీవుడ్ ని వదిలి ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నారు వీళ్లిద్దరు ఇప్పుడు. అయితే శ్రీలీల గురించి ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయమే ఒక స్టార్ హీరో కి కూడా ఉందట.

Sreeleela Photos

శ్రీలీల మీద ఆడియన్స్ లో ఉన్న అభిప్రాయం ఏమిటంటే డ్యాన్స్ అదరగొట్టేస్తుంది కానీ, యాక్టింగ్ పెద్దగా బాగుండదు అని. ఇప్పటి వరకు ఆమె కూడా నటన పరంగా నిరూపించుకున్న సినిమా కూడా పడలేదు. చేసిన సినిమాల్లో ‘భగవంత్ కేసరి’ లో మాత్రం పర్వాలేదు అనిపించే రేంజ్ యాక్టింగ్ చేసింది. కానీ ఇప్పుడు ఉన్న పోటీ వాతావరణం లో ఆ నటన ఏమాత్రం సరిపోదు.

- Advertisement -

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా శ్రీలీల ని ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్ తమ సినిమాలో తీసుకుందామని సదరు స్టార్ హీరో తో అన్నాడట. శ్రీలీల పేరు చెప్పగానే ఆమె సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చూసి, ఈ అమ్మాయిలో అసలు నటనే లేదు, మన సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కి యాక్టింగ్ టాలెంట్ ఒక రేంజ్ లో ఉండాలి, ఈ పాత్రకి ఆమె అసలు సరిపోదు అని చెప్పి శ్రీలీల ని రిజెక్ట్ చేసాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here