Renu Desai : అనుకోకుండా మరోసారి ప్రేమలో పడి మోసపోయాను అంటూ రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్!

- Advertisement -

Renu Desai : పవన్ కళ్యాణ్ తో ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకొని పదేళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రేణు దేశాయ్, కొన్ని అనుకోని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పటి నుండి తన సొంత ఊరు పూణే లో తన పిల్లలు అకిరా నందన్ మరియు ఆద్య తో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ సొంతంగా సినిమాలు నిర్మిస్తూ, అప్పుడప్పుడు దర్శకత్వం కూడా వహిస్తూ వచ్చారు.

Renu Desai
Renu Desai

ఇప్పుడు రీసెంట్ గా ఆమె ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో నటిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ రేణు దేశాయ్ కి మంచి పేరు వచ్చింది. ఇలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అని రీసెంట్ గా జరిగిన పలు ఇంటర్వూస్ లో కూడా చెప్పుకొచ్చింది.

Renu Desai Photos

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ఆమె కొన్నాళ్ళకు ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ని రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ పెళ్లి ఆగింది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో కూడా ఆమె దీని ప్రస్తావన తీసుకొని రాలేదు. కానీ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఆమె ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

- Advertisement -
Renu Desai News

నా జీవితం లోకి ప్రేమ అనేది ఒక అద్భుతం లాగ వచ్చింది, అదే ప్రేమ నా మనసుని గాయపర్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమ నన్ను వేధిస్తోంది, ప్రేమ చాలా చెడ్డది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా? , లేకుంటే మరొకరిని ఉద్దేశించి చేసిందా అనేది తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here