Mahesh Babu : పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారికంటే స్టార్ హీరోల వద్ద డ్రైవర్స్ గా పర్సనల్ అసిస్టెంట్స్ గా పని చేసేవారికి జీతాలు చాలా ఎక్కువగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అందుకు ఉదాహరణే సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రైవర్ జీతం. ఈయన జీతానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఆయన నెల జీతం అక్షరాలా 5 లక్షల రూపాయిల వరకు ఉంటుందట. కేవలం మహేష్ బాబు వ్యక్తిగత కార్ కి మాత్రమే కాకుండా, నమ్రత కార్ కి కూడా ఈయనే డ్రైవర్ అట. నెలకి 5 లక్షల రూపాయిలు జీతం అంటే సాధారణమైన విషయం కాదు. ఎన్నో ఏళ్ళ నుండి పని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కి కూడా అంత జీతాలు రావడం కష్టమే.

కేవలం మహేష్ బాబు కి మాత్రమే కాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్ కార్ డ్రైవర్లకు కూడా ఇంచుమించు ఇదే రేంజ్ లో జీతం ఉంటుందని టాక్. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధమా వుంటుంది.

20 వ తేదీ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతుందని టాక్. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే అని, ఇక పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న మూడవ సినిమా అవ్వడం వల్లే ఈ రేంజ్ హైప్ ఏర్పడింది, మరి ఆ హైప్ ని సినిమా కంటెంట్ కూడా మ్యాచ్ చేస్తుందో లేదో తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.
