Avika Gor : వామ్మో.. అవికా గోర్ ఇప్పటికే 20పెళ్లిళ్లు చేసుకుందట.. ‘చిన్నారి పెళ్లి కూతురు’ మామూలుది కాదు

- Advertisement -

Avika Gor : టాలీవుడ్ నటి అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వధువు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందు, అవికా గోర్, అలీరెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ మెహతా , మహేంద్ర సోని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Avika Gor
Avika Gor

వధువు వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అవికా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ అవికా గోర్ వెబ్ సిరీస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 20 సార్లు తెరపై పెళ్లి చేసుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కానీ ఎప్పుడూ బోర్ కొట్టలేదు. పెళ్లికూతురులా కనిపించడం అంటే చాలా ఇష్టం.. మరోసారి పెళ్లికూతురులా కనిపించనున్నట్లు తెలిపింది.

Actress Avika Gor

థ్రిల్లర్ జానర్‌లో రూపొందే ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అవికా గోర్ అన్నారు. బెంగాల్‌లో విజయవంతమైన వెబ్ సిరీస్ ఇందును.. తెలుగులో పెళ్లికూతురుగా తీసుకొస్తున్నారు. నేనెప్పుడూ ఇలాంటి స్క్రిప్ట్‌లో నటించలేదు. నాకు టీవీ సీరియల్‌లో నటించిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో, అలాంటి కంటెంట్ తప్పకుండా వదులో ఉంటుందని వివరించింది. చిన్నవయసులో నటిని అయ్యాను కాబట్టి వ్యక్తిగత జీవితానికి సమయం వెచ్చించలేకపోయాను. నటిగా రోజుకో కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. రోజుకో కొత్త జీవితాన్ని చూస్తున్నాను.. నిర్మాతగా ఫ్లాప్ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీలయ్యాను. భవిష్యతులో మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హిందీలో పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నానని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here