Alia Bhatt : నిన్న మొన్న వైరల్ అయిన రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీని తరువాత కత్రినా కైఫ్, కాజోల్ డీప్‌ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరూ సాంకేతికతను దుర్వినియోగం చేయడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పు అని, డీప్‌ఫేక్‌లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం త్వరలో కొత్త నిబంధనలను తీసుకువస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలా జరుగుతుండగానే తాజాగా అలియా భట్ కూడా డీప్ ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలి అవుతున్న సెలబ్రిటీల జాబితాలో స్టార్ హీరోయిన్ అలియా భట్ చేరారు. వైరల్ వీడియోలో ఒక అమ్మాయి నీలిరంగు పూల కో-ఆర్డ్ సెట్‌ను ధరించి కెమెరా వైపు అశ్లీల సంజ్ఞలు చేస్తున్నట్లు చూపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అలియా భట్ కాదని ఎవరైనా చెప్పవచ్చు. అలియా ముఖాన్ని వేరొకరి శరీరంపై అతికించారు.
చాలా మంది భారతీయ సెలబ్రిటీలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న కొద్ది రోజుల్లోనే అలియా వీడియో వచ్చింది. ఇది సాంకేతికత దుర్వినియోగం. ఇప్పటి వరకు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, సారా టెండూల్కర్, వ్యాపారవేత్త రతన్ టాటా వంటి సెలబ్రిటీలు ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి గురయ్యారు.