Shivani Rajashekar : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు రాజశేఖర్. డాక్టర్ వృత్తి నుండి ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరో గా ఎదిగిన ఏకైన వ్యక్తి ఆయన. ఒకప్పుడు మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో రాజశేఖర్ కి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయనకీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది.
ఆయనని హీరో గా పెట్టి సినిమాలు తీసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు, అందుకే క్యారక్టర్ రోల్స్ చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఇకపోతే ఆయన కూతుర్లు ఇద్దరూ కూడా ఇండస్ట్రీ లోకి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరికీ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. రీసెంట్ గానే పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే చిత్రం తో మన ముందుకు వచ్చింది.
ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, శివానీ కి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘WWW సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు నాకు కరోనా సోకింది. ఇది నాకు తెలియలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మ, నాన్న, చెల్లి ఇలా అందరికీ సోకింది.
అందరం తొందరగానే బయటపడ్డాం కానీ, నాన్న మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ప్రాణాలు సైతం రిస్క్ లో పడి ఐసియూ లో చావు చివరి అంచులు దాకా వెళ్లి వచ్చాడు. ఇదంతా నా వల్లే జరిగింది, ఈ దరిద్రానికి నేనే కారణం’ అంటూ శివాజీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.