Sreeleela : చేసుకుంటే అతనినే పెళ్లి చేసుకుంటా..లేదంటే ఇలాగే ఉండిపోతా అంటూ శ్రీలీల షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ప్రతీ ఒక్కరు ముక్తకంఠం తో చెప్పే పేరు శ్రీలీల. చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి దెబ్బకి అప్పటి వరకు ఇండస్ట్రీ లో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్స్ అడ్రస్లు మొత్తం గల్లంతు అయ్యింది. కేవలం రెండు మూడు సినిమాలతోనే ఈ రేంజ్ కి వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు.

Sreeleela
Sreeleela

అందం, డ్యాన్స్ మరియు నటన ఈ మూడు ఒక హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు. ఆ అరుదైన హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. అందుకే ఈమె ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అయితే ఈమె కెరీర్ ప్రస్తుతం ఒక హిట్, ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగుతుంది. ‘స్కంద’ తో ఫ్లాప్ అందుకున్న ఈ బ్యూటీ, భగవంత్ కేసరి తో సూపర్ హిట్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఆదికేశవ’ చిత్రం మరో డిజాస్టర్ గా నిల్చింది.

స్క్రిప్ట్ ఎంపిక లో జాగ్రత్త వహించకపోతే, ఎంత స్పీడ్ గా ఎదిగిందో,అంతే స్పీడ్ గా డౌన్ అయిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఈమె ఆశలు మొత్తం ‘గుంటూరు కారం’ చిత్రం పైనే పెట్టుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి కాబొయ్యే భర్త గురించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘నా కాబొయ్యే భర్త చాలా అందం గా ఉండాలి. అలాగే కుటుంబానికి విలువ ఇచ్చే వాడు అయ్యి ఉండాలి. అన్నిటికి మించి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, మూడ్ బాగాలేనప్పుడు జోక్స్ వేసి నన్ను నవ్వించాలి. ఒక్కోసారి నన్ను భరించడం చాలా కష్టం, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకోవాలి, అలాంటి వాడు దొరికేంత వరకు ఎదురు చూసి అతన్నే పెళ్లి చేసుకుంటా’ అంటూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here