Prudhvi Raj : మన టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో పృథ్వి రాజ్ కచ్చితంగా ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుండే ఈయన కమెడియన్ ఏమి కాదు. సీరియస్ క్యారక్టర్ రోల్స్ చేసేవారు, పలు సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. కానీ ‘ఖడ్గం’ చిత్రం పృథ్వి రాజ్ కెరీర్ ని మార్చేసింది. ఈ సినిమా లో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే డైలాగ్ తో ఫేమస్ అయిన పృథ్వీ అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
వరుసగా కమెడియన్ గా సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఒకానొక్క సమయం లో ఆయన ఏడాదికి 20 సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత పీక్ కెరీర్ ని వదిలి ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం పెద్ద మైనస్ అయ్యింది.
రాజకీయాల్లో ఆయనపై వచ్చిన ఆరోపణలు, పదవికి రాజీనామా చెయ్యడం వంటివి పృథ్వి రాజ్ ని మానసికంగా ఎంతో బాధించాయంట. బాగా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయాడట. రీసెంట్ గా తన కూతురు శ్రీలు తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన విషయం చెప్పుకొచ్చాడు. యాంకర్ మాట్లాడుతూ ‘ఈమధ్య మీరు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నారట..నిజమేనా?’ అని అడిగింది.
దానికి పృథ్వీ రాజ్ సమాధానం చెప్తూ ‘జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. అది నిజమే, కానీ ఆ చివరి నిమిషం లో విరమించుకున్నాను, కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, బయటపడడానికి చాలా కాలం అయ్యింది, నా కూతురు శ్రీలు వల్లే కోలుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీ. ఆయన కూతురు శ్రీలు ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ లో ఇది చెప్పుకొచ్చారు.