Jabardasth Emmanuel : వైష్ణవి చైతన్యను బెడ్ రూం వీడియో పంపించమన్న ఇమాన్యుయేల్.. ఓ రేంజ్‎లో ఆడేసుకుంటున్న నెటిజన్లు

- Advertisement -


Jabardasth Emmanuel : కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది జీవితాన్ని పొందారు. ఈ షోతో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా పాపులర్ అయ్యారు. అట్రాక్షన్ కోసం జనాలను ఆకర్షించడానికి కంటెస్టెంట్లకు మధ్య కాంట్రవర్సీలు, లవ్ ట్రాకులు ఇలా ఏదో ఒక క్లిప్‌ ను కట్ చేసి ప్రేక్షకులకు షోపై హైప్‌ పెంచేందుకు చూస్తుంటారు. ఇక ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. బేబీ సినిమా హీరో వీరాజ్‌ అశ్విన్ ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దీంతో కమెడియన్ ఆయనను అడగరాని ప్రశ్న అడిగాడు. ఇప్పటికే కామెడీ పేరుతో చాలాసార్లు ఈ షోలో కంటెస్టెంట్లు హద్దు దాటిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ షోలో ఓ కమెడియన్ చేసిన పనికి విరాజ్ తో పాటు జడ్జిలు, యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల జబర్దస్త్ కామెడీ షో లో హద్దు మీరి కామెడీ చేస్తూ వల్గర్ పంచ్ లతో జనాలను నవ్వించే కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసేవారు.. ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రేంజ్ లో కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నారు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ రిలీజ్ అయిన ప్రోమోలో ఓ క‌మెడియ‌న్‌ అందరికీ షాక్ ఇచ్చాడు. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించి వందకోట్లు రాబట్టిన బేబీ మూవీతో వైష్ణవి చైతన్యకు, ఆనంద్ దేవరకొండకు ఏ రేంజ్లో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఈ షోలో మరో హీరో విరాజ్ అశ్విన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ ఓ ప్రశ్న అడిగాడు. ఎలాగూ వచ్చారు కదా వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ గంట వీడియో ఉందా అది ఉంటే ఫార్వర్డ్ చేయండి అంటూ అడిగాడు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక విరాజ్ కిమ్మనక ఉండిపోయాడు. ఇక అక్కడే ఉన్న జడ్జిలు కుష్బూ, కృష్ణ భగవాన్ తో పాటు యాంకర్ రష్మీ కూడా కంగుతింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఇటీవల కాలంలో కామెడీకి హద్దు లేకుండా పోతుంది. మితిమీరిన డైలాగ్లు వేస్తూ చీఫ్ ప్రశ్నలు అడుగుతూ ఆ షోకు ఉన్న రేపిటేషన్ ను పోగొట్టుకుంటున్నారు అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here