Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీల కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా, శ్రీలీల తో రెండు మాస్ డ్యాన్స్ ఉన్న సాంగ్స్ చేయిస్తే చాలు, సినిమా బంపర్ హిట్ అనే విధంగా మారింది ప్రస్తుత పరిస్థితి. అందుకే ఈ కుర్ర హీరోయిన్ కి టాలీవుడ్ లో ఈ రేంజ్ అవకాశాలు వస్తున్నాయి. ఎంత రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదు, శ్రీలీల డేట్స్ దొరికితే చాలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
ఇదంతా పక్కన పెడితే శ్రీలీల రీసెంట్ గానే విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా ఒప్పుకొని, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక సినిమాకి సంతకం చేసి , ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం శ్రీలీల కి ఇదే మొదటిసారి.
అయితే ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వల్లనేనట. విషయం ఏమిటంటే ఈ చిత్రం ముందుగా ఎలాంటి లిప్ లాక్ సన్నివేశాలు ఉండవని డైరెక్టర్ గౌతమ్ చెప్పాడట. కానీ కథ చర్చల్లో రెండవ సిట్టింగ్ వేసినప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయి, కథకి కచ్చితంగా అవసరమైనవి అని డైరెక్టర్ చాలా ఫోర్స్ చేసాడట. దీనికి శ్రీలీల ఒప్పుకోలేదు, వెంటనే ఆ చిత్రం నుండి తప్పుకుంది.
అయితే అగ్రిమెంట్ ప్రకారం ఏ కారణం చేత అయినా సినిమా నుండి తప్పుకుంటే తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చేయాలట. అలా శ్రీలీల ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ అడ్వాన్స్ రెండు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చేసింది అట. అలా తన తప్పు ఏమి లేకుండా శ్రీలీల రెండు కోట్ల రూపాయిలు తిరిగి ఇచేయాల్సి వచ్చింది అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.