Bigg Boss లోనే గర్భం దాల్చిన లేడీ కంటెస్టెంట్.. ఇవేం పనులు అండీ బాబోయ్!

- Advertisement -

Bigg Boss : ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్ షో. తొలుత అమెరికా లో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఐడియా నచ్చడం తో ఇండియా లో మొదట హిందీ లో సల్మాన్ ఖాన్ తో ప్రారంభించారు. అక్కడ గ్రాండ్ హిట్ అయ్యి 16 సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 17 వ సీజన్ నడుస్తుంది. హిందీ లో హిట్ అవ్వడం చూసి తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రారంభమై గ్రాండ్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం మన తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి ఆదరణతో ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 17 హిందీ లో ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని చెప్పాలి.

అసలు విషయానికి వస్తే అంకిత లోఖండే మరియు విక్కై జైన్ అనే భార్య భర్తలు బిగ్ బాస్ హౌస్ లోకి జంటగా అడుగుపెట్టారు. వీళ్ళు హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఎదో ఒక గొడవ జరగడం, అంకిత అలగడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ ఎపిసోడ్ లో ఆమె మాట్లాడుతూ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రెగ్నన్సీ టెస్ట్ చేయించాను అని, కానీ డాక్టర్లు నెల తప్పలేదని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ప్రేగ్నసీ టెస్ట్ ని చెయ్యగా, ఇంకా ఫలితం రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంటే బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళిద్దరూ కలిసారా?, హౌస్ నుండి బయటకి వెళ్ళేటప్పుడు అంకితా గర్భం తోనే బయటకి వెళ్లబోతుందా అనే సందేహాలు ఇప్పుడు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళ్తే మాత్రం బిగ్ బాస్ హిస్టరీ లోనే అలాంటి సంఘటన జరగడం మొట్టమొదటిసారి అని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here