Aamani : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి సంసారం పక్షంగా ఉండే హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న నటి ఆమని. ఈమె ఇప్పటికీ కూడా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా ఆమని, ఆ తర్వాత కొన్నాళ్ళకు భర్త అనుమతితో క్యారక్టర్ రోల్స్ చేస్తూ వస్తుంది.

ఈమెకి ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈమె కోడలు ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సౌండ్ పార్టీ’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈమె పేరు హ్రితిక శ్రీనివాస్. ఈ సినిమా ఈ నెల 24 వ తారీఖున విడుదల కాబోతుండడంతో హ్రితిక ప్రొమోషన్స్ లో పాల్గొన్నది.

ఆమె మాట్లాడుతూ ‘ చిన్నప్పటి నుండి నాకు నటన అంటే ఎంతో ఇష్టం, ప్రముఖ హీరోయిన్ ఆమని నాకు అత్త అవుతుంది. నేను బాలనటిగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించాను. చిన్నప్పటి నుండి నటన మీద నాకు మా అత్త ప్రమేయం చాలా ఉంది. ఆమె వల్లనే నేను హీరోయిన్ అయ్యాను. గతం లో నేను అల్లంత దూరాన అనే సినిమాలో హీరోయిన్ గా నటించాను. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ చిత్రం తో మీ ముందుకు వస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఈమెని చూసిన ప్రతీ ఒక్కరు అమ్మాయి చాలా బాగుంది, నటన ఎలా ఉంటుందో తెలియదు కానీ, చూసేందుకు దాదాపుగా కృతి శెట్టి లాగ ఉంది, ఇంకా చెప్పాలంటే ఆమెకంటే బాగుంది కూడా, సరైన సూపర్ హిట్ పడితే ఈమె భవిష్యత్తులో మంచి స్టార్ హీరోయిన్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
