Mansoor Ali Khan : సౌతిండియాలో నటుడు మన్సూర్ అలీఖాన్ దాదాపు అందరికీ సుపరితులే. ఇటీవలే లియో సినిమాలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి ఆయన ఇటీవల హీరోయిన్ త్రిష పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసి వార్తల ముఖ్యాంశాల్లోకి ఎక్కారు. దీంతో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు , అభిమానులు ఆయన పై మండి పడుతున్నారు. అయితే తాజాగా త్రిష పైన రేప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఆయన క్లారిటీ ఇచ్చారు. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన మాటలను తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. త్రిష గురించి నేను తప్పుగా మాట్లాడానంటూ వస్తున్న వార్తలను నా కుమార్తె కొడుకు నాకు పంపారు. ఇది నా సినిమా విడుదల టైంలో వచ్చింది. నేను రాబోయే ఎన్నికల బరిలో ఉన్నారు.
ఆ వీడియోలో నేను త్రిష గురించి చాలా గొప్పగా మాట్లాడాను. సినిమాల్లో ఆమె నటనను ప్రశంసించాను. పాతకాలం లాగా ఈ రోజుల్లో హీరోయిన్స్‌తో నటించే అవకాశాలు రావడం లేదని కేవలం నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను. కానీ ఆ వీడియో చూస్తుంటే నా మాటలను ఎడిట్ చేసి త్రిషకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా ట్రిమ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసి త్రిషకు నామీద కోపం వచ్చేలా చేశారు. ఇలాంటి వివాదాలు సృష్టించే వారి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. త్రిషకు ట్రిమ్ చేసిన వెర్షన్‌ను చూపించారు. నాతో కలిసి నటించిన హీరోయిన్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నారు. వారు విజయవంతమైన వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. లియో చిత్రం పూజా కార్యక్రమంలో త్రిషకు నా కూతురు దిల్రూబా నీ ఫ్యాన్ అని చెప్పాను.
నేను ఇప్పటి వరకు దాదాపు 360కి పైగా సినిమాల్లో నటించాను. నా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కావాల్సి ఉంది. నేనే వారికి పెళ్లి చేయాలి. నేనెప్పుడూ నా సహనటులను గౌరవిస్తాను. నేను మహిళలను ఎంతగా గౌరవిస్తానో.. నాతో కలిసి పనిచేసిన వాళ్లకు తెలుసు. కానీ ఇది నన్ను వ్యతిరేకించే కొందరు చేసిన పని.. త్రిషకు ఇప్పుడు కోపం తెప్పించేలా చేశారు. దీనికంటే ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందు దానిపై ఫోకస్ చేయండి” అంటూ ఓ నోట్ షేర్ చేశారు ఆయన. త్రిష ఫై తనకు మంచి అభిప్రాయం ఉంది. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం చేస్తారనుకోలేదు.. తాను ఎవరినో ఎలాంటి వాడిని అందరికీ తెలుసు అంటూ తమిళంలో ఒక పోస్టు రాసుకొచ్చారు. ప్రస్తుతం పోస్టు వైరల్ గా మారుతోంది.